ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komatireddy vs Chruku Sudhakar: నయూమే నన్నేం చేయలేకపోయాడు, వెంకట్‌రెడ్డి ఏం చేస్తాడు: చెరుకు సుధాకర్‌

ABN, First Publish Date - 2023-03-05T20:17:25+05:30

నయీం లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకపోయాడు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Ventakareddy) ఏం చేస్తాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నల్గొండ: ‘‘నయీం లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకపోయాడు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Ventakareddy) ఏం చేస్తాడు’’ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ (Chruku Sudhakar) సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతి ఉండి మాట్లాడాడో లేక మతిలేక మాట్లాడాడో అర్థం కావడం లేదని అన్నారు. వెంకట్‌రెడ్డి తీవ్ర పదజాలం ఉపయోగించి తన కుమారుడికి ఫోన్‌ చేసి తిట్టడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ విషయాన్ని తాను సీరియస్‌గా తీసుకుంటానని ప్రకటించారు. తాను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా, ఆయన స్టార్‌ క్యాంపెయినర్‌ (Star campaigner)గా పని చేస్తున్నారని, తనపై ఆ భాష ఏంటని ప్రశ్నించారు. తాను వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్‌ చేయలేదని పేర్కొన్నారు. వెంకట్‌రెడ్డి అసభ్యపదజాలంతో తిట్టిన ఆడియో రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ పరిరక్షణకు మాట్లాడుకున్నాం తప్పితే వెంకట్‌రెడ్డిని తాను వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు ఏవీ లేవన్నారు. పార్టీ శ్రేణుల్లో, రాష్ట్ర ప్రజల దృష్టిలో వెంకట్‌రెడ్డి డకౌట్‌ అయిన వికెట్‌ అన్నారు. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వెంకట్‌రెడ్డిపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని రుకు సుధాకర్‌ కోరారు.

సుధాకర్‌ ప్రకటనతోనే ఎంపీ ఆగ్రహమా?

చెరుకు సుధాకర్‌ రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంటే వెంకట్‌రెడ్డి ఆగ్రహానికి కారణమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీడబ్ల్యూసీలో అవకాశమిస్తే తాను మరింత బాగా పనిచేస్తానంటూ వెంకట్‌రెడ్డి ప్రకటనను సుధాకర్‌ కౌంటర్‌ చేశారు. ‘వెంకట్‌రెడ్డి పార్టీలో సీనియర్‌.. పార్టీ ఆయనతోనే లేచింది అనే భ్రమలో ఉన్నారు. పార్టీ కోసం పనిచేసేందుకు పదవి అవసరమా?.. పార్టీలో విశ్వసనీయత పెంచుకోవాలని, మునుగోడులో తన తమ్ముడి విజయం కోసం పనిచేసిన కాంగ్రెస్‌ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయనే స్వయంగా రికమండ్‌ చేసి తన విశ్వసనీయత నిరూపించుకోవాలి. పార్టీ కోసం వెంకట్‌రెడ్డి గట్టిగా పనిచేసి సీడబ్ల్యూసీ దక్కించుకుంటే తానే మొదట ఆయనకు దండ వేస్తా’ అంటూ సుధాకర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే వెంకట్‌రెడ్డి ఆగ్రహానికి కారణమని వినికిడి.

కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం

చెరుకు సుధాకర్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను నల్లగొండలోని గడియారం సెంటర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దహనం చేశారు. చెరుకు సుధాకర్‌ హత్యకు ప్లాన్‌ చేసిన వెంకట్‌రెడ్డిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అయితగోని జనార్థన్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్‌ డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లో చంపేస్తామని వెంకట్‌రెడ్డి బెదిరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అగ్రకుల అహంకారంతో బడుగు, బలహీన వర్గాల ఎదుగుదలను చూసి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు. తక్షణమే ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని లేకుంటే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-03-05T20:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising