CMRF: సీఎంఆర్‌ఎఫ్ మెడికల్ బిల్లుల గోల్‌మాల్
ABN, First Publish Date - 2023-04-07T16:34:02+05:30
పేదలకు మేలుచేయాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధిని (సీఎంఆర్‌ఎఫ్) దొంగలేమేసేస్తున్నారు. ఫేక్ బిల్లులకు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నిధులను కొట్టేస్తున్నారు.
హైదరాబాద్: పేదలకు మేలుచేయాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధిని (సీఎంఆర్‌ఎఫ్) దొంగలేమేసేస్తున్నారు. ఫేక్ బిల్లులకు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నిధులను కొట్టేస్తున్నారు. సర్కారు పెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ మెలికతో అసలే సాయం సైజు తగ్గిపోయింది. ఈ కాస్త పేదల ‘నిధి’నీ వదిలిపెట్టడం లేదు. సీఎంఆర్‌ఎఫ్ మెడికల్ బిల్లుల గోల్‌మాల్ జరిగింది. రెండు ఆస్పత్రులతోపాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. ట్రీట్‌మెంట్ చేయకపోయినా.. చేయించినట్లు నకిలీ బిల్లులు సృష్టించి అడ్డంగా బుక్కయ్యారు. సీఎంఆర్‌ఎఫ్ మెడికల్ బిల్లుల గోల్‌మాల్ వ్యవహారంపై ఖమ్మం (Khammam)కు చెందిన శ్రీవినాయక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మిర్యాలగూడ (Miryalaguda)కు చెందిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై కేసునమోదు చేశారు. నల్గొండకు చెందిన జ్యోతి, లక్ష్మీ, దిరావత్, శివలపై కేసు చేశారు. ఆస్పత్రికి ఎల్‌వోసీ ఇప్పించి కేటుగాళ్లు డబ్బులు కాజేశారు. సీఎంఆర్‌ఎఫ్ నిధుల గోల్‌మాల్‌పై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Updated Date - 2023-04-07T16:46:31+05:30 IST