TS Politics: కాంగ్రెస్- కామ్రేడ్ల మధ్య సీట్ల వ్యవహారం కొలిక్కి వచ్చినట్లేనా..?
ABN, First Publish Date - 2023-09-07T22:19:33+05:30
సీపీఐ నేతల (CPI Leaders) సమావేశం ముగిసింది. కాంగ్రెస్ (Congress) పార్టీతో పొత్తులపై చర్చించినట్లు సీపీఐ నేతలు తెలిపారు.
హైదరాబాద్: సీపీఐ నేతల (CPI Leaders) సమావేశం ముగిసింది. కాంగ్రెస్ (Congress) పార్టీతో పొత్తులపై చర్చించినట్లు సీపీఐ నేతలు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ముందు కొన్ని డిమాండ్లను ఉంచామని సీపీఐ నేతలు పేర్కొన్నారు. తమ డిమాండ్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటే ఒకే.. లేదంటే ఏం చేయాలి అనేది తర్వాత సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
కేసీ వేణుగోపాల్.. తాము ఆశిస్తోన్న సీట్ల జాబితా ఇచ్చినట్లు నారాయణ తెలిపారు.
ఖమ్మంలో - కొత్తగూడం, వైరా
నల్గొండలో - మునుగోడు
ఆదిలాబాద్‌లో - బెల్లంపల్లి
కరీంనగర్‌లో - హుస్నాబాద్
ఖమ్మం జిల్లాలోనే రెండు సీట్లు ఇవ్వలేమని, ఒకటి ఇస్తామని కాంగ్రెస్ పేర్కొనగా.. సీపీఐ కొత్తగూడెం కావాలని కోరింది. దాంతో హుస్నాబాద్ కోసం సీపీఐ పట్టు పట్టినట్లు తెలుస్తోంది. కొత్తగూడం సీటు ఇచ్చి తీరాల్సిందేనని సీపీఐ పట్టు పట్టింది.
Updated Date - 2023-09-07T22:27:05+05:30 IST