Congress: తెలంగాణ ప్రజలకు సీడబ్ల్యూసీ ప్రత్యేక వినతి..
ABN, First Publish Date - 2023-09-17T14:43:18+05:30
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక వినతి చేసింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను (Congress party) గుర్తుచేసుకున్న సీడబ్ల్యూసీ.. రాజకీయ ఒడిదొడుకులు పక్కన పెట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రస్తావించింది. 9 ఏళ్ళు గడిచినా ఢిల్లీ, హైదరాబాద్ ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక వినతి చేసింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను (Congress party) గుర్తుచేసుకున్న సీడబ్ల్యూసీ.. రాజకీయ ఒడిదొడుకులు పక్కన పెట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రస్తావించింది. 9 ఏళ్ళు గడిచినా ఢిల్లీ, హైదరాబాద్ ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. కేసీఆర్ కుటుంబ పాలనకు తెరలేపి ప్రజా సమస్యలు మర్చిపోయారని విమర్శలు గుప్పించింది. బంగారు తెలంగాణ అటుంచి నిజాంల పరిపాలన తీసుకొచ్చారని సీడబ్ల్యూసీ మండిపడింది. రాహుల్ గాంధీ తెలంగాణలో 405 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తుచేసింది. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారని, ధరణి పోర్టల్‌తో ఇందిరా గాంధీ సమయంలో ఇచ్చిన భూములను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు.
తెలంగాణలో చరిత్ర సృష్టించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణలో విజయం సాధిస్తామని సీడబ్ల్యూసీ ధీమా వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటు వేయాలని పార్టీ విన్నవించింది. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తెలంగాణలో చరిత్ర సృష్టించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సీడబ్ల్యూసీ విశ్వాసం వ్యక్తం చేసింది.
రేపు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటన
తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో సోమవారం (రేపు) పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు పర్యటించనున్నారు. కామారెడ్డిలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చెరంజిత్ చన్నీ, ఆదిలాబాద్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, కరీంనగర్‌లో ఏపీ పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు, కుత్బుల్లాపూర్‌లో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు సుబ్బిరామిరెడ్డి, జూబ్లీహిల్స్‌లో లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, జడ్చర్లలో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, రాజేంద్రనగర్‌లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్, ఎల్బీనగర్‌లో ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగేల్ పాల్గొననున్నారు.
Updated Date - 2023-09-17T14:43:18+05:30 IST