Kavitha ED Enquiry Live: ఈడీ ఆఫీస్ ముందు భారీగా పోలీసుల మోహరింపు.. ఏం జరుగుతోంది..
ABN, First Publish Date - 2023-03-20T10:14:27+05:30
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha).. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Kavitha ED Enquiry) నోటీసుల మేరకు..
09:28 PM: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటల సమయంలో ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత దాదాపు 10:30 గంటల విచారణ తర్వాత రాత్రి 9:14 గంటల సమయం బయటకొచ్చారు. 9:25 గంటలకు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కాగా సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెను అధికారులు పంపించారు.
06:10 pm: ఈడీ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు.
05:48 pm: ఈడీ ఆఫీసుకు వచ్చిన కవిత తరపు న్యాయవాదుల బృందం. తెలంగాణ అడిషనల్ ఏజీతోపాటు లాయర్లు గండ్ర మోహన్, భరత్ ఉన్నారు. ఇద్దరు వైద్యులు కూడా ఈడీ ఆఫీస్‌కు వెళ్లారని తెలుస్తోంది.
05:05 pm: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు (మంగళవారం) విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.
04:45 pm: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను 6 గంటలుగా ప్రశ్నిస్తోన్న ఈడీ అధికారులు
* అరుణ్ రామచంద్ర పిళ్లైకి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలింపు
04:00 pm: కవిత, అరుణ్ పిళ్లైని కలిపి విచారించిన ఈడీ అధికారులు
* పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ ఆరా
* లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ప్రశ్నిస్తున్న ఈడీ
03:45 pm : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి జ్యుడీషియల్ కస్టడీ
* 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 6, 2023న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది.
03:00 pm: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ఈడీ విచారణ మొదలై ఇప్పటికి దాదాపు 4 గంటలు
* కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు
02:30 pm: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు లేటెస్ట్ అప్‌డేట్
* ముగిసిన అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఈడీ కస్టడీ
* కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ అధికారులు
* బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కన్‌ఫ్రంటేషన్ అనంతరం కోర్టుకు పిళ్ళై
02:00 pm: ఈడీ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు
* సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచిన సీబీఐ
* ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, కీలక దశలో ఉందని సీబీఐ వాదన
* సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగింపు
01:30 pm: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2 గంటలకు పైగానే కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ
* సాయంత్రం 6 గంటల వరకూ విచారించే అవకాశం
* రామచంద్రపిళ్లైతో కలిపి కవితను ప్రశ్నిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు
* కాసేపట్లో కవితకు లంచ్ బ్రేక్..
01:00 pm: ఆదిలాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తెలంగాణకు సంబంధం లేదు: ABNతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
* కవిత చేసిన తప్పునకు తెలంగాణ ప్రజలు బాధ్యత వహించాలా?
* లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుని కవిత తెలంగాణ పరువు తీశారు
* గాంధీ టోపీ పెట్టుకుని కేజ్రీవాల్ ప్రజలకు టోపీ పెట్టారు
* కవిత నుంచి కేజ్రీవాల్ వరకు ప్రమేయం ఉన్నవారందరిపై చర్యలు తీసుకోవాలి
12:30 pm: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ లేటెస్ట్ అప్‌డేట్
* ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై ప్రశ్నలు
* ఆప్‌కి ముట్టిన వందకోట్ల ముడుపులపై ఈడీ ప్రశ్నలు
* బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఇతర డాక్యుమెంట్లపైనా ఈడీ ఆరా
* గంటన్నరగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ
12:00 pm: ఒక పక్క కవితను ఈడీ విచారిస్తుండగానే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
* ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ స్కామ్ నిందితుడు అభిషేక్ బోయినపల్లికి చుక్కెదురు
* మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
* తన కుమారుడి స్కూల్ అడ్మిషన్ రీత్యా తన హాజరు తప్పనిసరి అని అందుకోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన అభిషేక్
* మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
11:30 am: కవిత ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లిన సమయంలో ఆమె చేతిలో డాక్యుమెంట్ లాంటి పేపర్
* ఈడీ అడిగిన వివరాలను నేరుగా అందించేందుకు కవిత ఆ పేపర్ తీసుకెళ్లినట్లు సమాచారం
11:00 am: ఈడీ కార్యాలయం దగ్గర కవిత భావోద్వేగం
* భర్త అనిల్‌ను ఆలింగనం చేసుకున్న కవిత
10:50 am: కవిత ఈడీ ఆఫీస్‌కు బయల్దేరే ముందు కనిపించిన దృశ్యాలు
10:45 am: ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
* లిక్కర్ స్కామ్ కేసులో రెండో సారి ఈడీ ముందుకు కవిత
* కవిత, అరుణ్ పిళ్లై కలిపి ఈడీ ప్రశ్నించే అవకాశం
* పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ ఆరా
* ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై ప్రశ్నించే అవకాశం
10:30 am: కవితతో కలిసి ఈడీ ఆఫీస్ ఎంట్రీ వరకూ వెళ్లిన ఆమె భర్త అనిల్
* ధైర్యం చెప్పి కవితను ఈడీ ఆఫీస్‌లోకి పంపిన ఆమె భర్త
10:20 am: ఈడీ ఆఫీస్‌కు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత
* లిక్కర్ స్కామ్ కేసులో రెండో సారి ఈడీ ముందుకు కవిత
10:15 am: ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర భద్రత పెంపు
* ఈడీ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు
* భారీగా బారికేడ్స్ ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు
10:10 am: ఢిల్లీకి మారిన తెలంగాణ పాలిటిక్స్
* హస్తినకు క్యూ కట్టిన తెలంగాణ మంత్రులు, నేతలు
* ఢిల్లీలో మంత్రి కేటీఆర్, కవిత భర్త అనిల్, ఎంపీ సంతోష్, ముఖ్య నేతలు
* ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీ వెళ్లిన BRS నేతలు
* ఢిల్లీకి అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు
10:00 am: ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
* ఈడీ విచారణకు వెళ్లాలని కవితకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం
* 24న సుప్రీంకోర్టు ఇవ్వబోయే గైడెన్స్ కోసం ఎదురుచూస్తున్న కవిత
* ఈడీ విచారణకు హాజరుపై లాయర్లతో కవిత సమావేశం
* హాజరు కాకపోతే విచారణకు సహకరించడం లేదని ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న న్యాయ నిపుణులు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha).. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Kavitha ED Enquiry) నోటీసుల మేరకు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భర్త అనిల్, సోదరుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR), ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్ (MP Joginapally Santosh Kumar), వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, పలువురు న్యాయవాదులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా తుగ్లక్ రోడ్డులోని తన తండ్రి, సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి (CM KCR Delhi House) చేరుకున్నారు.
విచారణలో ఏ ప్రశ్నలు అడుగుతారు? సమాధానాలు ఏం చెప్పాలి? అసలు విచారణకు హాజరు కాకపోతే పరిస్థితి ఏంటి? అనే అంశాలపై రాత్రి వీరంతా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈనెల 11న మొదటిసారి ఈడీ విచారణకు హాజరైన కవిత రెండోసారి ఈ నెల 16న గైర్హాజరైన విషయం తెలిసిందే. న్యాయ నిపుణులతో కూడా చర్చించాక నేటి ఈడీ విచారణకు కవిత హాజరవుతుండటం గమనార్హం.
Updated Date - 2023-03-20T21:30:08+05:30 IST