Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి కొత్త ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రికల పంపిణీ
ABN, First Publish Date - 2023-12-06T17:29:20+05:30
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఇన్విటేషన్లను గాంధీభవన్ సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ముఖ్య నేతలకు గాంధీభవన్ ఆహ్వానాలు పంపింది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఇన్విటేషన్లను గాంధీభవన్ సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ముఖ్య నేతలకు గాంధీభవన్ ఆహ్వానాలు పంపింది. రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు, కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలకు సైతం ఇన్విటేషన్లు ఇవ్వనున్నారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు సైతం ఆహ్వానాలు పంపనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు సైతం ఆహ్వానాలు అందించనున్నారు.
Updated Date - 2023-12-06T17:43:39+05:30 IST