ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dr. Anuradha: ఎన్నికల్లో పోటీపై అసలు విషయం చెప్పిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె.. ఆమె ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2023-08-31T12:01:27+05:30

తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి

ఇల్లెందు(భద్రాద్రి కొత్తగూడెం): తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తానని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య(Former MLA of Illendu Gummadi Narsaiya) కుమార్తె, ఉస్మానియా లా కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. గుమ్మడి అనురాధ(Dr. Gummadi Anuradha) ప్రకటించారు. ఇల్లెందులోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గంలో తన తండ్రి గుమ్మడి నర్సయ్య గతంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారని, ఆయన వారసురాలిగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలిపారు. తనను కొంతమంది అధికార పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడారని, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు ఉందని తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఏ పార్టీకీ సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచేందుకు నిర్ణయించుకున్నానని వివరించారు. ఇల్లెందు నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులను, కులసంఘాల నాయకులను ఇప్పటికే కలిసి మద్దతు కోరినట్లు వివరించారు. వారూ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించారని వెల్లడించారు.

15సంవత్సరాలుగా ఇల్లెందు నియోజకవర్గం(Yellendu Constituency)లో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. తాను ఉద్యమ నేపథ్యంలో నుంచి వచ్చానని, పీడీఎ్‌సయూలో రాష్ట్రస్థాయి నాయకురాలిగా పనిచేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా క్యాంప్‌సలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. రాజకీయపక్షాళన కోసం ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధే ద్వేయంగా పనిచేస్తానన్నారు. తనలాంటి వ్యక్తులు రావడం వల్ల రాజకీయాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. దగాకోరు, కుట్రలు, కుతంత్రాలు, కబ్జాలు చేసే రాజకీయాలకంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్నట్లు వివరించారు. విద్యాతోపాటు సహజ వనరులను వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రోళ్లపాడు ప్రాజెక్టును కుట్రపూరితంగా లేకుండా చేశారని విమర్శించారు. ఇల్లెందు నియోజకవర్గంలో పేరుకుపోయిన పలు సమస్యలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరు పిలిచినా తాను వెళ్లనని, స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో అనురాధ అనుచరులు యాదాల చంటి, దామళ్ల నవీన్‌, ఫసీ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-31T12:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising