D.Raja: రాజకీయ లబ్ధి కోసమే దేశం పేరు మార్పు తెరపైకి తెచ్చారంటూ మోదీ సర్కారుపై డి.రాజా విమర్శలు
ABN, First Publish Date - 2023-09-17T17:15:15+05:30
మోదీ సర్కారుపై (Modi government) సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: మోదీ సర్కారుపై (Modi government) సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) విమర్శలు గుప్పించారు.
"కమ్యూనిస్టులు చరిత్రలో భాగస్వాములు కాదు... చరిత్ర సృష్టించిన వాళ్ళు. దేశ స్వాతంత్య్రంలోనూ కమ్యూనిస్టులు ఎంతో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్టులు ముందు నిలబడిన తర్వాతే స్వాతంత్రం సిద్ధించింది. 1925లో సీపీఐ ఏర్పడింది. తెలంగాణకు రజాకార్ల నుంచి విముక్తి కల్పించెలా కమ్యూనిస్టులు పోరాటాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఏ పోరాటంలోనైనా కమ్యూనిస్టులు ముందుండి నడిపించారు. కమ్యూనిస్టులు ఎన్నో త్యాగాలు చేశారు. స్వాతంత్ర సమయంలో అర్ఎస్ఎస్, జనసంఘ్ ఎక్కడ ఉంది. రజాకార్లపై పోరాటంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ రాజకీయం చేస్తోంది. మోదీ, అమిత్ షా ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ దేశ చరిత్ర మాత్రం ఎప్పటికీ ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసమే దేశం పేరు మార్పు తెరపైకి తెచ్చారు. దేశం కష్టాల్లో ఉంది. జీ20 సమావేశాల తర్వాత మోదీ ప్రఖ్యాత వ్యక్తిగా మారినట్లు చెపుతున్నారు. రూపాయి విలువ పడిపోతుంది. దీనిపై మోదీ సమాధానం చెప్పాలి. గత పదేళ్ళలో సామాజిక, ఆర్థిక అసమానతల ఏర్పడ్డాయి. మహిళలు, చిన్నారులకు భద్రత లేకుండా పోయింది. రెజ్లింగ్ చాంపియన్లు న్యాయం కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. మణిపూర్ లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నా.. ఎందుకు అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంటుకు జవాబుదారీ తనం లోపించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూన్నారు. గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోంది." అని డి.రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-17T17:16:50+05:30 IST