ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi liquor policy scam: ఈడీ ఛార్జ్షీట్లో పలు సంచలన విషయాలు

ABN, First Publish Date - 2023-01-06T19:27:29+05:30

ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

Delhi liquor policy scam
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాం కేసు(Delhi liquor policy scam)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) సప్లిమెంటరీ ఛార్జ్షీట్ (supplementary charge sheet) దాఖలు చేసింది. మొత్తం 13,600 పేజీలతో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తెలంగాణకు చెందిన రాజకీయ నేతల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి సహా మరో నలుగురిపై ఈ ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఈ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి శరత్చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై శనివారం సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. శరత్చంద్రారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు వాదనలు ప్రారంభమౌతాయి. విజయనాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు జ్యూడిషియల్ కస్టడీ శనివారం ముగియనుంది. అలాగే శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేయనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ నిందితులను ప్రవేశపెట్టనుంది.

సౌత్గ్రూపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha), శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవ భాగస్వాములుగా ఉన్నారు. కవిత, విజయ సాయిరెడ్డి బంధువు శరత్చంద్రారెడ్డిల పాత్రపై ఈడీ పలు కీలక అంశాలు ప్రస్తావించింది. హోల్సేల్ వ్యాపారంలో 12 శాతం లాభాలు, రిటైల్లో 185% లాభాలు వచ్చేలా మద్యం విధాన రూపకల్పనలో అక్రమాలు జరిగాయని ఈడీ తెలిపింది. కవిత హోల్సేల్ వ్యాపారంలోనూ, శరత్చంద్రారెడ్డి రిటైల్ వ్యాపారంలోనూ భాగస్వాములు అయ్యారని వెల్లడించింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసంలో నిందితులు పలుమార్లు భేటీ అయ్యారని, పాత్రధారులు, సూత్రధారులు ఢిల్లీ హైదరాబాద్ హోటల్స్లో బస చేశారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. శరత్చంద్రారెడ్డికి చెందిన చార్టెడ్ ఫ్లైట్స్లో నిందితులు, పాత్రధారులు ప్రయాణాలు చేశారని వెల్లడించింది. కవిత నివాసం, ఢిల్లీ లోధి రోడ్‌లోని మాగుంట శ్రీనివాస్రెడ్డి నివాసంలోనూ తాజ్మాన్సింగ్, ఒబెరాయ్, మేడిన్ హైదరాబాద్, ఐటీసీ, కోహినూర్ హోటళ్లలో భేటీలు జరిగాయని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. హవాలా మార్గంలో డబ్బు తరలించినట్లు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్లో కవిత తరపు ప్రతినిధి అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు కవిత తరపున సమీర్ మహేంద్ర ఇండో స్పిరిట్లో వాటా పొందారని వెల్లడించింది. హోల్సేల్ వ్యాపారంలో ఇండోస్పిరిట్ L1 గా నిలిచేలా కవిత ప్రయత్నాలు చేశారని, ఇండోస్పిరిట్ కోసం ఆప్ నేతలతో కవిత మాట్లాడారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కేసు వెలుగులోకి వచ్చాక సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌నాయర్ వందల కోట్ల కిక్ బాగ్స్ అందుకున్నారని ఈడీ ఆరోపించింది. లబ్ధి, ప్రయోజనాలు కలిగించినందుకు ప్రతిఫలంగా హోల్సేల్ వ్యాపారంలో, వచ్చే లాభాల్లో ఆప్ నేతలకు 6 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఎన్నికల కారణంగా ముందుగానే ముడుపుల వ్యవహారం నడిచిందని ఈడీ ఆరోపించింది. ఇండో స్పిరిట్ ద్వారా కవిత హోల్ సేల్ వ్యాపారంలో భాగస్వామి అయితే, శరత్ చంద్రారెడ్డి రిటైల్ జోన్స్లో మద్యం వ్యాపారం చేశారని ఈడీ తెలిపింది. మొత్తం 32 జోన్లకుగాను సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట చెందిన సంస్థలు 9 జోన్లు దక్కించుకున్నాయి. సౌత్ గ్రూపుకు దక్కిన 9 రిటైల్ జోన్లలో శరత్ చంద్రారెడ్డికి చెందిన ట్రైడెంట్, అవంతిక ఆర్గానోమిక్స్ ఐదు జోన్లలో, మాగుంట రాఘవకు చెందిన మాగుంట ఆగ్రో ఫార్మ్స్ లిమిటెడ్ రెండు జోన్లలో వ్యాపారం చేసిందని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ట్రైడెంట్, అవంతిక ఆర్గానోమిక్స్ల రిటైల్ వ్యాపారం కోసం తన కంపెనీలు మహిరా వెంచర్స్, యాక్సిస్ క్లినికల్స్ నుంచి శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించారని ఈడీ తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో విజయసాయిరెడ్డి బంధువు శరత్చంద్రారెడ్డి కింగ్ పిన్‌గా వ్యవహరించారు. క్రెడిట్ నోట్స్ రూపంలోనూ శరత్ చంద్రారెడ్డి కంపెనీలు లబ్ధి పొందాయి. కిక్ బాగ్స్ ముడుపులు శరత్ చంద్రారెడ్డి సమకూర్చిన కారణంగా ఇండోస్పిరిట్ నుంచి రిటైల్ బిజినెస్ కోసం శరత్ చంద్రారెడ్డికి మద్యం సరఫరా చేశారు. ముడుపుల డబ్బుల భర్తీ కింద శరత్ చంద్రారెడ్డి కంపెనీలకు సరఫరా చేసిన మద్యానికి సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ కంపెనీ డబ్బులు వసూలు చేయలేదు. శరత్ చంద్రారెడ్డి కంపెనీల నియంత్రణలో ఉన్న రిటైల్ జోన్స్లో కేవలం నగదు రూపంలోనే మద్యం అమ్మకాలు జరిగాయి. ఐదు జోన్లలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదు మొత్తం ప్రతిరోజు డిఫెన్స్ కాలనీలోని బేస్‌మెంట్ కార్యాలయానికి చేరవేశారు. కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట తరపున సౌత్ గ్రూప్ నుంచి ముడుపుల తరలింపు జరిగిందని ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి తరఫున హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి రిటైల్ జోన్లలో వ్యవహారాలు చూసుకున్నారు. కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంటలతో కూడిన సౌత్ గ్రూప్ తరపున రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్ ఢిల్లీ లిక్కర్ వ్యవహారాలు నడిపారు. కవిత ద్వారానే అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి సంబంధాలు ఏర్పడ్డాయని ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రుతో పాటు ఆయనకు చెందిన నాలుగు కంపెనీలను నిందితులుగా చేరుస్తూ ఈడీ గతంలోనే తొలి చార్జిషీటు దాఖలు చేసింది.

Updated Date - 2023-01-06T22:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising