VBIT College: ఘట్కేసర్ వీబీఐటీ కాలేజీ కేసులో నిందితులు అరెస్ట్

ABN, First Publish Date - 2023-01-07T16:59:14+05:30

ఘట్కేసర్ వీబీఐటీ కాలేజీ (VBIT College) కేసులో పురోగతి లభించింది. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోల మార్ఫింగ్ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

VBIT College: ఘట్కేసర్ వీబీఐటీ కాలేజీ కేసులో నిందితులు అరెస్ట్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఘట్కేసర్ వీబీఐటీ కాలేజీ (VBIT College) కేసులో పురోగతి లభించింది. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోల మార్ఫింగ్ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను వేధించిన నలుగురు సైబర్ చీటర్స్‌‌ను అరెస్ట్‌ చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ (DS Chauhan) మీడియాకు వెల్లడించారు. నిందితుల పేర్లు గణేష్, ప్రదీప్, సతీష్, దుర్గాప్రసాద్‌గా వెల్లడించారు. నిందితులు సోషల్‌మీడియాలో ప్రత్యేక గ్రూప్స్ ఏర్పాటు చేసి కాలేజీ విద్యార్థినులను వేధిస్తున్నారని తెలిపారు. నిందితులపై ఐపీసీ, ఐటీ, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సీపీ చౌహాన్‌ తెలిపారు.

కాగా వీబీఐటీ కాలేజీ ఘటనలో తొలుత ఫస్టియర్ విద్యార్థినిని నిందితుడు ప్రదీప్ ట్రాప్ చేశాడు. విద్యార్థిని ద్వారా ప్రదీప్ కాలేజీ గ్రూప్‌లో చేరాడు. 'ఎంటర్ ద డ్రాగన్' పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. లింకులను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి.. వాటి ద్వారా అమ్మాయిల ఫోన్లను కేటుగాళ్లు హ్యాక్‌ చేశారు. గ్రూప్‌లో అమ్మాయిల నెంబర్లు సేకరించి నిందితులు బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-07T17:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising