Gangula Kamalakar : పొన్నం విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయటపడింది
ABN, First Publish Date - 2023-06-20T13:32:39+05:30
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయట పడిందని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కనీసం కార్పోరేటర్‌ను కూడా పొన్నం గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎం మాత్రమే కాదని.. తన మీద కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయవచ్చన్నారు.
కరీంనగర్ : కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయట పడిందని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కనీసం కార్పోరేటర్‌ను కూడా పొన్నం గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎం మాత్రమే కాదని.. తన మీద కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయవచ్చన్నారు. తన పని తాను చేసుకుంటానని.. తన జోలికి వస్తే విడిచిపెట్టబోనని గంగుల హెచ్చరించారు. తన మీద పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కేసులు వేశారన్నారు. వారిద్దరూ ఒక్కటేనన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ విచారణలో ఏమీ తేలలేదన్నారు. ఎన్నికల ముందు గానా బజానాలు రావడం సహజమేనన్నారు. బీఆర్ఎస్ 60 శాతం, కాంగ్రెస్, బీజేపీ రెండు కలిపి నలభై శాతమేనని గంగుల అన్నారు.
Updated Date - 2023-06-20T13:32:39+05:30 IST