ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Stray Dogs Attack: బాలుడిపై పిచ్చికుక్కల దాడికి నమ్మలేని కారణం చెప్పిన జీహెచ్‌ఎంసీ మేయర్.. అంతా షాక్!

ABN, First Publish Date - 2023-02-21T19:05:09+05:30

అంబర్‌పేటలో పిచ్చికుక్కల దాడిలో 5 ఏళ్ల బాలుడి మృతి ఘటనపై జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్‌ విజయలక్ష్మి స్పందించారు. కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంబర్‌పేటలో పిచ్చికుక్కల దాడిలో 5 ఏళ్ల బాలుడి మృతి ఘటనపై జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్‌ విజయలక్ష్మి స్పందించారు. కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరమని, చిన్నారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని మేయర్‌ హామీ ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ (Greater Hyderabad)లో 5.70 లక్షల కుక్కలు ఉన్నాయని, అంబర్‌పేట (Amberpet) లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాలుడిపై కుక్కల దాడి నేపథ్యంలో అధికారులతో ఆమె అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి జోనల్‌ కమిషనర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల నిర్మూలన, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంబర్‌పేట ఘటనపై విజయలక్ష్మి (Vijayalakshmi) విచారణకు ఆదేశించారు.

మేయర్ విజయలక్ష్మీ వ్యాఖ్యలు ఇక్కడివరకు బాగానే ఉన్నా.. బాలుడిని చంపిన కుక్కలకు ప్రతిరోజూ ఓ మహిళ మాంసం పెడుతుండేదని, ఆమె 2 రోజులుగా కనిపించకపోవడంతో ఆకలితో కుక్కలు దాడి చేసి ఉండొచ్చంటూ ఆమె సందేహం వెలిబుచ్చారు. అంతేకాదు.. అన్నింటికీ జీహెచ్ఎంసీదే బాధ్యతని అంటే ఎలా? అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అత్యవసర భేటీలో ఏం చర్చిస్తారు?.. అంబర్‌పేట ఘటన నేపథ్యంలో ఎలాంటి చర్యలు ప్రకటిస్తారు?.. బాలుడి కుటుంబానికి ఏవిధంగా చేయూతగా నిలుస్తారని అందరూ ఎదురుచూస్తుండగా ఆమె చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఒకపక్క అన్యాయంగా బాలుడి ప్రాణాలు పోతే ఇంత నిర్లక్ష్యపూరిత సమాధానం చెబుతారా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాగా అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిని ఏమాత్రం ప్రతిఘటించలేని ఆ పసిహృదయం ప్రాణాలు వదలింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలానికి చెందిన గంగాధర్ పొట్టకూటి కోసం కుటుంబంతోసహా హైదరాబాద్‌కు వలస వచ్చాడు. భార్య, ఆరేళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్‌తో కలిసి బాగ్‌ అంబర్‌పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఛే నంబర్ ఛౌరస్తాలో కారు సర్వీసింగ్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం కావడంతో తన ఇద్దరు పిల్లలను సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. గంగాధర్ పనిలో నిమగ్నమవ్వగా నాలుగేళ్ల ప్రదీప్ ఒంటరిగా వీధిలోకి వెళ్లాడు. అక్కడున్న వీధి కుక్కలు అతడిని చుట్టుముట్టి దాడి చేశాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. విషయాన్ని గుర్తించి తండ్రి గంగాధర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కుక్కలను చెదరగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-21T19:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising