ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Assembly: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. ఆసక్తికరంగా గవర్నర్ ప్రసంగం

ABN, First Publish Date - 2023-02-03T13:00:43+05:30

సీఎం కేసీఆర్ (CM KCR) సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundararajan) మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం.. కోర్ట్ జోక్యంతో బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానం.. గవర్నర్ ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Telangana Assembly Budget session) సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundararajan) మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం.. కోర్ట్ జోక్యంతో బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానం.. గవర్నర్ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Telangana Assembly Budget session) సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy), ముఖ్యమంత్రి కేసీఆర్ నమస్కరించి గవర్నర్ తమిళిసైకి స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని ఆమె యథాతథంగా చదివారు.

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత, ప్రజాప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిందని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ గ్రామాలు ఇప్పుడు కళకళలాడుతున్నాయని హార్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం మారిందన్నారు. పచ్చదనంలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతోందని, దేశం నివ్వరబోయే అద్భుతాలను తెలంగాణ ఆవిష్కరిస్తోందని తమిళిసై అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఎదిగిందన్నారు. ‘‘ వ్యవసాయరంగంలో గొప్ప స్థిరీకరణను తెలంగాణ సాధించింది. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసింది. 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగింది.

రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందుతోంది. పంటపెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల పంట పెట్టుబడి సాయం. రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. 2020-21 నాటికి 2,126 యూనిట్లకు తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది. అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల స్వాలంబన అభివృద్ధికి కృషి’’ అని తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

పంటపెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందిస్తున్నామని, రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిపై దేశవ్యాప్త చర్చ జరుగుతోందన్నారు. 2020-21 నాటికి 2,126 యూనిట్లకు తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. చరిత్రలో తొలిసారి దళితబంధుతో రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నామన్నారు.

తెలంగాణలో మెడికల్ కాలేజీలు 17కు పెంచామని, మరో 9 ఏర్పాటు చేస్తామన్నారు. పెన్షన్ దారుల వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గించామని, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. మరోవైపు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని ప్రస్తావించారు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన గవర్నర్ తమిళిసై దాశరథి గేయంతో ముగించారు.

Updated Date - 2023-02-03T14:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising