ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mallareddy: మంత్రి మల్లారెడ్డికి ఎదురుగాలి

ABN, First Publish Date - 2023-01-28T18:37:44+05:30

మంత్రి మల్లారెడ్డి (Mallareddy)కి ఎదురుగాలి వీస్తోంది. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Jawaharnagar Mucipal Corporation) మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: మంత్రి మల్లారెడ్డి (Mallareddy)కి ఎదురుగాలి వీస్తోంది. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Jawaharnagar Mucipal Corporation) మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి ఇలాకలో జవహర్‌నగర్‌తో పాటు మేడ్చల్‌ మున్సిపల్‌ (Medchal Municipal) చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా వైస్‌ చైర్మన్‌తో పాటు 16 మంది కౌన్సిలర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రోజు రోజుకు సమస్య పెరుగుతుండటంతో మంత్రి కలుగ చేసుకుని చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కౌన్సిలర్లు ఒప్పుకోకపోవడంతో చైర్‌పర్సన్‌ను, కౌన్సిలర్లను మంత్రి తన నివాసానికి రావాలని ఆదేశించారు. దీంతో వైస్‌ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసానికి తరలివెళ్లారు. వ్యక్తిగత కారణాలతో చైర్‌పర్సన్‌ వెళ్లకపోవడంతో రెండు రోజుల తర్వాత మాట్లాడేందుకు మంత్రి హామీ ఇవ్వడంతో కౌన్సిలర్లు వెనుదిరిగారు.

ఆ మధ్య మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. మంత్రి తీరును ఎండగడుతూ మూకుమ్మడిగా విమర్శలు చేశారు. మల్లారెడ్డి కేవలం మేడ్చల్‌ నియోజకవర్గానికి మాత్రమే మంత్రిగా వ్యవహరిస్తున్నారని, పదవులన్నీ తన సొంత నియోజకవర్గానికే ఇచ్చుకుంటున్నారంటూ వారు తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. మల్కాజిగిరి, శేరిలింగంపల్లి (Malkajigiri Serilingampalle), కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, అరికపూడి గాంధీ, కేపీ వివేకానంద్‌, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్‌రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు. అప్పట్లో ఈ వ్యవహారం బీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది.

వివాదాలకు కేరాఫ్ .. మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి వ్యవహారశైలి ఇటీవల వరుస వివాదాలకు దారి తీస్తోంది. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెడ్డి సంఘం సమావేశంలో మాట్లాడిన తీరు, ఐటీ రైడ్స్‌ సమయంలో అధికారులతో వ్యవహరించిన తీరు, మెడికల్‌ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో రెడ్డి అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఐటీ కట్టాల్సిన అవసరం లేదనడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తొడగొడుతూ సవాల్‌ చేయడం వంటి చేష్టలతో మల్లారెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆయనపై పలు భూవివాదాలు కూడా ఉన్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతోనూ మంత్రి మల్లారెడ్డికి పొసగడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-01-28T18:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising