Revanth Reddy: రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2023-03-03T18:19:39+05:30
రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ (Hath Se Hath Jodo Yatra)కు భద్రత పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పిటిషన్ దాఖలు చేశారు....
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ (Hath Se Hath Jodo Yatra)కు భద్రత పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. రేవంత్‌రెడ్డి పాదయాత్ర జరిగే అన్నిప్రాంతాల్లో.. ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే ఫ్యాక్స్ కాపీని న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు. వాదనలు విన్న న్యాయస్థానం పాదయాత్రకు భద్రత కల్పిస్తే విచారణ కొనసాగించాల్సిన అవసమేంటని ప్రశ్నించింది. డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 6కు వాయిదా వేశారు.
జోడోతో జనంలోకి
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుబంధంగా హాథ్‌సే హాథ్ జోడో యాత్రను టీపీసీసీ చేపట్టింది. ఫిబ్రవరి 6వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే యాత్ర నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాచరికానికి వ్యతిరేకంగా ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. మొత్తం రెండు నెలల పాటు అన్ని నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ప్రతీ ఇంటికి కాంగ్రెస్ స్టిక్కర్ అంటించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే సహజ స్వేచ్ఛను వినియోగించుకుని నేతలు తమదైన శైలిలో వారివారి నియోజకవర్గాల్లో జోడో యాత్రను నిర్వహిస్తున్నారు.
Updated Date - 2023-03-03T18:19:39+05:30 IST