ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HYD: భారత సైన్యానికి యుద్ధ ట్యాంక్‌ల అప్పగింత

ABN, First Publish Date - 2023-10-31T10:12:25+05:30

సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ(Ordnance Factory) నుంచి సోమవారం క్యారియర్‌ కమాండ్‌ పోస్ట్‌ ట్రాక్డ్‌ (సీసీపీటీ)

అల్వాల్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ(Ordnance Factory) నుంచి సోమవారం క్యారియర్‌ కమాండ్‌ పోస్ట్‌ ట్రాక్డ్‌ (సీసీపీటీ) యుద్ధ ట్యాంక్‌లను విడుదల చేశారు. డీజీ ఆర్టిలరీ, డీఆర్‌డీవో, డీజీక్యూఏ, బీఈఎల్‌ సీనియర్‌ అధికారుల సమక్షంలో అధికారికంగా భారత సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కే.సుధాకర్‌ మాట్లాడుతూ యుద్ధట్యాంక్‌లను మిలటరీకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది నట్టు చెప్పారు. వ్యూహాత్మకంగా ఫైర్‌ నియంత్రణ సాధించేలా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కమ్యూనికేషన్స్‌ సిస్టమ్‌, జీపీఎస్‌, డీసీహెచ్‌ సిస్టమ్‌, ఎన్‌హాన్స్‌డ్‌ టాక్టికల్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌తో పాటు ఫీల్డ్‌ టెలిఫోన్లను యుద్ధట్యాంక్‌లో ప్రత్యేకంగా అమర్చినట్టు తెలిపారు. యుద్దట్యాంక్‌లను సుధాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ అధికారులు సార్జిత్‌రెడ్డి, రాజే్‌ష్‌కుమార్‌, ప్రసాద్‌, రాజేంద్ర ఐవాలా, రాజీవ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-31T10:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising