HYD: మల్కాజిగిరిపై ‘జనసేన’ నజర్! బరిలో కీలక నేత
ABN, First Publish Date - 2023-10-27T08:15:28+05:30
ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో గ్రేటర్‌లో కొన్ని స్థానాల్లో బరిలో నిలిచేందుకు
- పొత్తు చర్చల నేపథ్యంలో జోరుగా ప్రచారం
మల్కాజిగిరి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో గ్రేటర్‌లో కొన్ని స్థానాల్లో బరిలో నిలిచేందుకు పవన్‌సేన సిద్ధమవుతోంది. పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానున్న నేపథ్యంలో జనసేన మల్కాజిగిరి(Malkajigiri) అసెంబ్లీ స్థానంపై కన్నేసింది. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాంచనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ కీలక నేతను జనసేనాని పోటీలో ఉంచుతారని చెబుతున్నారు. అయితే, బీజేపీ టికెట్ కోసం నలుగురు నేతలు జోరుగా పైరవీలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, ప్రముఖ బిల్డర్, జీకే కన్‌స్ట్రక్షన్స్ అధినేత జీకే హన్మంతరావుతోపాటు మల్కాజిగిరి కార్పొరేటర్ ఉరపల్లి శ్రవణ్ టికెట్ రేసులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు ఈసారి పోటీకి అనాసక్తిని ప్రదర్శించడంతో ఈ నలుగురు హస్తిన స్థాయిలో జోరుగా పైరవీ చేస్తున్నారు. ప్రధానంగా ఆకుల రాజేందర్, భానుప్రకాశ్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆకుల రాజేందర్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి(Former CM Kiran Kumar Reddy) ద్వారా అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Updated Date - 2023-10-27T08:15:28+05:30 IST