ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pallavi Prashanth: బిగ్‌బాస్-7 విన్నర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

ABN, Publish Date - Dec 18 , 2023 | 04:03 PM

Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్‌కు చెందిన పలువురు అభిమానులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. సీసీఫుటేజీ, వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరిగిన అన్నపూర్ణ స్టూడియో వద్దకు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు భారీగా చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేస్తూ బాహాబాహీకి దిగారు. ప్రశాంత్‌ను బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటించగానే అతడి అభిమానులు సంబరాలు చేసుకోగా అమర్ దీప్ అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం మొదలై గొడవకు దారితీసింది. దీంతో అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రశాంత్, అమర్ అభిమానులు పరస్పర దాడులతో ఆగిపోకుండా రోడ్డుపై హంగామా సృష్టించారు. అటువైపు వచ్చిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలపై దాడులు చేసి అద్దాలు ధ్వంసం చేశారు.

అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచివి కావని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ సీపీ సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్లే అవుతుందన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదని. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సందడి చేశాడు. తన సొంత గ్రామమైన గజ్వేల్ మండలం కొల్గూరు స్వగ్రామానికి వచ్చిన పల్లవి ప్రశాంత్‌కు కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 05:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising