Hyderabad: వణికిస్తున్న చలి.. రాజేంద్రనగర్‌లో 12.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN, First Publish Date - 2023-12-13T07:28:38+05:30
నగరవాసులను చలిగాలులు వణికిస్తున్నాయి. మంగళవారం అత్యల్పంగా రాజేంద్రనగర్(Rajendranagar)లో 12.7, పటాన్‌చెరు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరవాసులను చలిగాలులు వణికిస్తున్నాయి. మంగళవారం అత్యల్పంగా రాజేంద్రనగర్(Rajendranagar)లో 12.7, పటాన్‌చెరులో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్‌లో సాధారణం కంటే 4 - 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం వేళల్లో పొగమంచు రహదారులను కప్పేస్తోంది. మరో రెండు రోజుల పాటు నగరంలో గరిష్ఠంగా 29, కనిష్ఠంగా 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. 04-06 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు తూర్పు దిశగా వీస్తాయన్నారు.
Updated Date - 2023-12-13T07:28:40+05:30 IST