ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

South Central Railway: సికింద్రాబాద్‌కు వచ్చే 7 రైళ్లు రద్దు

ABN, First Publish Date - 2023-02-15T12:42:24+05:30

గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదంతో సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గోదావరి ఎక్స్ప్రెస్ (Godavari Express Train) ప్రమాదంతో సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) చర్యలు చేపట్టింది. పలురైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామును విశాఖపట్నం (Visakhapatnam) నుంచి హైదరాబాద్‌ (Hyderabad) కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బీబీనగర్‌ (BB Nagar) వద్ద పట్టాలు తప్పింది. మొత్తం ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అధునాతన రైల్వే బోగీలు (Railway coaches) కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే పలు చర్యలు తీసుకుంది. సికింద్రాబాద్ (Secundrabad) కు వచ్చే ఏడు రైళ్ల (Seven Trains)ను రద్దు చేసింది. అలాగే 12 రైళ్ల (12 Trains) ను దారి మళ్లించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

అందువల్లే ప్రమాద తీవ్ర తగ్గిందన్న సీపీఆర్వో

మరోవైపు గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేష్ (Sounth Central Railway CPRO Rakesh) స్పందించారు. ఎల్‌హెచ్‌బీ కోచ్ టెక్నాలజీ (LHB Coach Technology)తోనే ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు లింక్ హాఫ్ మన్ బుష్ కోచ్లు ఉండటం వల్ల ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ (Automatic brake system) పనిచేసిందని చెప్పుకొచ్చారు. బోగీలు ఢీకొనకుండా.. పక్కకు పోకుండా ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీ ఆపగలిగిందని సీపీఆర్వో రాకేష్ (CPRO Rakesh) తెలిపారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా?...

గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై రైల్వే అధికారులు (Railaway Officeials) వివరణ ఇచ్చారు. రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బీబీనగర్ - ఘట్కేసర్ (Bibinagar - Ghatkesar) మధ్య గోదావరి ఎక్స్ప్రెస్ ఆరు బోగీలు పట్టాలు తప్పాయన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? అనేది పరిశీలిస్తున్నామన్నారు. రైలు పట్టాలు తప్పిన స్థలంలో భారీ మలుపు ఉందని... మలుపు దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించిందన్నారు. మరోవైపు గంట ఆలస్యంగా రైలు నడుస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఆలస్యాన్ని కవర్ చేసేందుకే లోకో పైలెట్ (Loco Pilot).. రైలు వేగాన్ని పెంచాడా? అనేది పరిశీలిస్తున్నామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

జరిగిన ప్రమాదం ఇదే....

కాగా... విశాఖపట్నం (Visakhapatnam) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు (Godavari Express Train) బుధవారం తెల్లవారుజామున బీబీ నగర్ (BB Nagar)వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అయితే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (Godavari Express)లోని ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతిన్నది. సుమారు కిలోమీటర్ల మేర ట్రాక్ (Railway Track) దెబ్బతిన్నది. వెంటనే రైల్వే సిబ్బంది (Railway staff) అక్కడకు చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. ట్రాక్‌ రిపేర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కాగా... ట్రాక్ దెబ్బ తినడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ -1, ఎస్‌ -2, ఎస్‌ - 3, ఎస్ - 4తో పాటు రెండు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి.

అయితే అధునాతన రైల్వే బోగీలు (Railway coaches) కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎల్‌హెచ్‌సీ (LHC) సాంకేతికత ఆధారంగా కొత్త బోగీలు తయారు చేశారు. పట్టాలు తప్పిన ఆరు బోగీలను తిరిగి పట్టాల మీదకు తెచ్చి తరలించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టాలు తప్పిన ఆరు భోగిల్లో నాలుగు రిజర్వేషన్ బోగీలు ఉన్నాయి. ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తుండే విషయం తెలిసిందే. విశాఖలో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు నాంపల్లి స్టేషన్‌లో గమ్య స్థానానికి చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు తెల్లవారుజామున 5.15కి చేరుకునే ఈ రైలులో కొన్ని వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

కిరండోల్‌ పాసింజర్‌ రైలు కూడా...

ఇటీవల కిరండోల్‌ పాసింజర్‌ రైలు (Kirandol Passenger Train)కు పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. జనవరి 17న ఉదయం 9.40 గంటల సమయంలో అరకు సెక్షన్‌ (Araku Section) పరిధిలోని శివలింగాపురం రైల్వే స్టేషన్‌ (Shivalingapuram Railway Station) సమీపంలో గల ఏడో నంబర్‌ టన్నెల్‌ వద్ద ఈ రైలు పట్టాలు తప్పింది. వెనుక నుంచి ఆరో బోగీ చక్రాలు పట్టాలు తప్పగా.. చివరిలో ఉన్న రెండు విస్టాడోమ్‌ కోచ్‌లు (Vistadome coaches) టన్నెల్‌లోనే ఉండిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై బోగీల నుంచి కిందకు దిగిపోయారు.

రైల్వే ఉన్నతాధికారులు (Railway officials) హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన ఆరో బోగీ నుంచి వెనుక గల బోగీల్లోని ప్రయాణికులను ముందున్న 11 బోగీల్లోకి మార్చారు. ఈ 11 బోగీలతో రైలు ముందుకు కదిలింది. మధ్యాహ్నం రెండు గంటలకు రైలు అరకులోయ చేరుకుంది. దీంతో కిరండోల్‌ వరకూ వెళ్లాల్సిన పాసింజర్‌ను అరకు వరకే పరిమితం చేశారు.

Updated Date - 2023-02-15T12:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising