data leak case: డేటా లీక్ కేసులో కీలక మలుపు
ABN, First Publish Date - 2023-04-01T17:45:26+05:30
డేటా లీక్ కేసులో (data leak case) కీలక మలుపు తిరిగింది.
హైదరాబాద్: డేటా లీక్ కేసులో (data leak case) కీలక మలుపు తిరిగింది. 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాల్లోని 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ జరిగింది. ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ (Vinay Bharadwaj)ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) తెలిపారు. 6 మెట్రోపాలిటిన్ సిటీల్లో 4.5 లక్షల ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నాడు. డీమార్ట్, నీట్, పాన్‌కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఆదాయపన్ను, డిఫెన్స్‌కు సంబంధించిన అధికారుల డేటా చోరీకి గురైంది. 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటాను నిందితుడు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్‌స్టాగ్రామ్, జొమాటో, పాలసీ బజార్, బై జ్యూస్, వేదాంత సంస్థల డేటా అపహరణకు గురైందని పోలీసులు వెల్లడించారు.
Updated Date - 2023-04-01T17:47:09+05:30 IST