ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drugs Case: కేపీ చౌదరితో కాల్స్ వ్యవహారంపై స్పందించిన నటి జ్యోతి..

ABN, First Publish Date - 2023-06-25T11:33:54+05:30

హైదరాబాద్: కేపీ చౌదరితో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేపీ చౌదరి (KP Choudary)తో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి (Actor Jyothy) స్పందించారు. తాను ఈ డ్రగ్స్ కేసు (Drugs Case)లో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో వీడియో (Video) పోస్ట్ చేశారు. కేపీ చౌదరితో తనకు కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్ తప్ప డ్రగ్స్‌తో సంబంధం లేదన్నారు. ఏ విచారణకు అయినా తాను సిద్ధంగానే ఉన్నానని, తన ఫోన్ పోలీసులకు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. డేటా రిట్రీవ్ చేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. తాను ఎప్పుడూ డ్రగ్ కన్ఫ్యూమ్ చేయలేదని, ఏ తప్పు చేయలేదని, భయపడేదిలేదని చెప్పారు. సిక్కిరెడ్డి వాళ్ళ ఇంట్లో పార్టీ జరిగిందంటున్నారు... అలాంటి పార్టీలకు తాను హాజరవ్వనని, తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరారు.

కాగా డ్రగ్స్ కేసులో పోలీసులు సెలబ్రెటీలకు (Celebrities) నోటీసులు ఇవ్వనున్నారు. కేపీ చౌదరి వ్యవహారంలో డ్రగ్స్‌పై సైబరాబాద్ పోలీసులు విచారించునున్నారు. డ్రగ్స్ వ్యవహారంపై సినీతారలు, సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. కేపీ చౌదరి రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ డ్రైవ్‌ (Google Drive)లో ఉన్న డేటాను పోలీసులు సేకరించారు. దీంతో సెలబ్రెటీలు, ఇతర వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే కేపీ చౌదరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి తమ మధ్య ఫోన్ కాంటాక్టులు సహజమని సినీ ప్రముఖులు చెబుతూ.. ఏ విచారణకైనా, టెస్ట్ కైనా సిద్ధమని సెలబ్రిటీలు అంటున్నారు.

Updated Date - 2023-06-25T11:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising