Manikrao Thakre: ‘ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తారు’
ABN, First Publish Date - 2023-05-06T15:40:34+05:30
ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే విమర్శించారు.
హైదరాబాద్: ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే (AICC Incharge Manikarao Thakre) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత చాలా నిరుత్సాహంతో ఉన్నారన్నారు. ప్రియాంకా గాంధీ (Priyanaka Gandhi) సభ ద్వారా ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో జరిగిన అన్యాయంపై మాట్లాడుతారని తెలిపారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనలో ఏం చేయబోతున్నామో చెబుతారన్నారు. ఈ సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని అన్నారు. యువత కాంగ్రెస్‌పై నమ్మకంతో ఉన్నారని తెలిపారు. అన్ని వర్గాల నిరుద్యోగ యువత ప్రియాంకా గాంధీ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత ఆకాక్షల మేరకు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చిందని.. కానీ 9 ఏళ్లలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయంలోనే అని అన్నారు. తొమ్మిది సంవత్సరాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగ కల్పన జరుగలేదని మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-05-06T16:05:03+05:30 IST