CV Anand: ఎన్నికల కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం
ABN, First Publish Date - 2023-10-09T19:37:39+05:30
తెలంగాణ ఎన్నికల(Telangana election) కోసం సర్వం సిద్ధం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) తెలపారు. సోమవారం నాడు ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల(Telangana election) కోసం సర్వం సిద్ధం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) తెలపారు. సోమవారం నాడు ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ.. 430 పోలింగ్ స్టేషన్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. 1,587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించాం. 32 కేంద్ర బలగాలు అవసరం. గతంలో జరిగిన కేసులు, గొడవలను దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. మద్యం, డబ్బులు పంపిణీ, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టం. లైసెన్స్ ఉన్న వారు తుపాకీలు తీసుకొని బయట తిరగొద్దు. గుండాలపై ప్రవెంటివ్ ఆక్షన్స్ తీసుకుంటాం. 652 మందిని బైండోవర్ చేశాం. 18 మందిపై పీడీయాక్ట్ ప్రయోగించాం. 24 గంటల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు టీమ్స్ పని చేస్తాయి. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తాం.
ఆన్‌లైన్ డబ్బుల పంపిణీ, ట్రాన్స్‌ఫర్లపై ప్రత్యేక నిఘా పెట్టం. 15 నియోజకవర్గాలల్లో 15 మంది నోడల్ ఆఫీసర్లను పెట్టాం. బ్యాంక్ సహాయం తీసుకొని డిజిటల్ పేమెంట్స్‌పై ప్రత్యే నిఘా పెడతామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Updated Date - 2023-10-09T19:37:39+05:30 IST