ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS: తారాస్థాయికి బీఆర్‌ఎస్ వర్గపోరు.. రోడ్డుపైనే...

ABN, First Publish Date - 2023-04-11T13:45:43+05:30

అంబర్‌పేట్ బీఆర్‌ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: అంబర్‌పేట్ బీఆర్‌ఎస్‌ (BRS)లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అంబర్‌పేట్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సాక్షిగా బీఆర్‌ఎస్ నేతల (BRS Leaders) మధ్య ఘర్షణ తలెత్తింది. అంబర్‌పేట్‌లో జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో గోల్నాక కార్పొరేటర్ భర్త (Golnaka corporator husband), ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ (MLA Kaleru Venkatesh) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే, కార్పొరేటర్ అనుచరులు రోడ్డు మీదే కొట్టుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.

జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, గోల్నాక కార్పొరేటర్ భర్త శ్రీనివాస్‌గౌడ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పూలే విగ్రహానికి పూల మాల వేసే క్రమంలో గోల్నాక కార్పొరేటర్ లావణ్య (Golnaka Corporator Lavanya)ను ఎమ్మెల్యే నెట్టుకుంటూ వెళ్లారని ఆరోపించారు. అయితే గత కొద్ది కాలంగా అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కానీయకుండా కార్పొరేటర్లను ఎమ్మెల్యే దూరం పెడుతున్నారంటూ ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరుపై గోల్నాక కార్పొరేటర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కార్పొరేటర్‌ను కలుపుకోకుండా అనుచరులతోనే ఎమ్మెల్యే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం గోల్నాక చౌరస్తా వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ భర్త శ్రీనివాస్‌కు ఘర్షణ జరిగింది. ఇరువురూ రోడ్డుపై పరస్పరం దూషించుకున్నారు. వెంటనే పోలీసులు ఇరువురికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ప్రతీ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకు, క్యాడెర్‌కు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఒక్కరే కార్యక్రమాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కార్పొరేటర్‌ను నెట్టేశారంటూ కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై శ్రీనివాస్ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-04-11T13:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising