ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR Birthday Celebrations: ఊహించని ఘటన... ప్రాణభయంతో పరుగులు తీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే..

ABN, First Publish Date - 2023-02-17T12:31:50+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుక (Chief Minister KCR birthday celebration)ల్లో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని కాచిగూడలో కేసీఆర్ జన్మదిన వేడుకలను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ (Amberpet MLA Kaleru Venkatesh) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు (BRS Activists) బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు అక్కడ ఏర్పాటు చేసిన గ్యాస్ బెలూన్లపై పడ్డాయి. దీంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. ఊహించని ఈ ఘటనతో కార్యకర్తలు పరుగులు తీశారు. తోపులాటలో అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్ (Amberpet MLA) కిందపడిపోయారు.

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు (BRS Leaders) అంబర్‌పేటలో పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచా పేల్చారు. అయితే నిప్పురవ్వలు ఎగిసిపడి అక్కడే ఉన్న గ్యాస్ బెలూన్లపై పడటంతో మంటలు చెలరేగాయి. కార్యకర్తలపై నిప్పురవ్వలు పడ్డాయి. వెంటనే కార్యకర్తలు అక్కడి నుంచి పరుగులు తీశారు. కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే పరుగులు పెట్టేందుకు ప్రయత్నించి కిందపడిపోయారు. కాగా.. ఎమ్మెల్యే వెంకటేష్‌కు పెను ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలైన వెంకటేష్‌ను వెంటనే అక్కడి నుంచి తరలించారు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ కేడర్ ఘనంగా నిర్వహిస్తోంది. అయితే పలు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనతో అక్కడి స్థానికులు ఆందోళన చెందారు. బెలూన్లు పేలి పెద్ద శబ్ధం రావడంతో వందలాదిగా ఉన్న స్థానికులు కూడా అక్కడి నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2023-02-17T13:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising