ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్..

ABN, Publish Date - Dec 28 , 2023 | 08:21 AM

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది.

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఈరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రమంలో దిగి.. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు. గంటపాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరపనున్నారు.

సాయంత్రం 3.05 గంటలకు అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 3.50 గంటలకు కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్‌కు వెళతారు. గంటన్నర పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5.40 గంటలకు కొంగరకాలన్ నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. హోటల్‌లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అసెంబ్లీలో పార్టీ శాసనసభపక్ష నేతను ఎంపిక చేయనున్నారు. 6.50 గంటలకు అమిత్ షా తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు.

Updated Date - Dec 28 , 2023 | 12:09 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising