TS NEWS: గద్దర్‌కు అధికారిక లాంఛనాలపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ATF లేఖ
ABN, First Publish Date - 2023-08-07T21:20:41+05:30
గద్దర్(Gaddar)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(TS GOVT) అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై భారత రాష్ట్రపతి(President of India)కి, తెలంగాణ గవర్నర్(Telangana Governor )కు ATF(యాంటి టెర్రరిజం ఫోరం) డా॥ రావినూతల శశిధర్(Ravinuthala Shasidhar) లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు
హైదరాబాద్: గద్దర్(Gaddar)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(TS GOVT) అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై భారత రాష్ట్రపతి(President of India)కి, తెలంగాణ గవర్నర్(Telangana Governor )కు ATF(యాంటి టెర్రరిజం ఫోరం) డా॥ రావినూతల శశిధర్(Ravinuthala Shasidhar) లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
లేఖలో ఏం చెప్పారంటే..
‘‘నిషేదిత మావోయిస్టు (నక్సలైట్) భావజాలానికి సిద్ధాంత కర్త అయిన గద్దర్ అంతిమ సంస్కారంలో పోలీసులతో గన్ సెల్యూట్ చేయించడం తీవ్రవాదంపై పోరులో పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. తెలంగాణా ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చను తెస్తుంది. నక్సలైట్ల (మావోయిస్టుల) మారణహోమంలో బలిదానాలు చేసిన పోలీసుల జాతీయవాదుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం అవమాన పరిచింది. గద్దర్ అంతిమయాత్ర చూస్తే అర్బన్ నక్సలైట్లు ఏ రకమైన ఏకో సిస్టం నిర్మాణం చేసుకున్నారో అర్థం అవుతుంది’’ అని డా॥ రావినూతల శశిధర్ తెలిపారు.
Updated Date - 2023-08-07T21:20:49+05:30 IST