ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: ప్రీతిది ముమ్మాటికీ హత్యే

ABN, First Publish Date - 2023-02-26T23:55:39+05:30

ప్రీతి మరణం(Preeti's death) అత్యంత బాధాకరం. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేస్తోందని బీజేపీ(Bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రీతి మరణం(Preeti's death) అత్యంత బాధాకరం. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేస్తోందని బీజేపీ(Bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ తెలిపారు. ‘‘ఇది ముమ్మాటికీ హత్యే. ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే ఈ దారుణం. మీరిచ్చే రూ.10 లక్షల సాయం... ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? ప్రీతి చావుకు కారణమైన వ్యక్తికి ఇన్నాళ్లు వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గులేదా?ఈ దారుణ ఘటనపై ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు.గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే సీఎం స్పందించలేదా?కేసీఆర్ పాలన (kcr govt)లో బీఆర్ఎస్, ఎంఐఎం (BRS MIM) మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ ఘటన అద్దం పడుతోంది.కేసీఆర్ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సహా ఎంతో భవిష్యత్తు ఉన్న పసిపిల్లలు, విద్యార్థులు చనిపోవడం అత్యంత దుర్మార్గం.ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్ట ప్రసక్తే లేదు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే. ప్రీతి మరణానికి కారణమైన దుర్మార్గులను శిక్షించే వరకు పోరాడతాం. మేధావులు, విద్యావేత్తలు సహా సభ్యసమాజం వెంటనే స్పందించాలి. భవిష్యత్తులో ప్రీతిలాంటి అమ్మాయిలకు ఈ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కన్నుమూసింది. ఐదురోజులుగా నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ కుమార్తె ఇకలేరని తెలుసుకున్న తల్లిదండ్రులు (Preethi Parents) కన్నీరుమున్నీరవుతున్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!

******************************

Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో

******************************

Doctor Preethi died: మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్

Updated Date - 2023-02-27T00:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising