ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Boora Narsaiah: లిక్కర్ స్కాంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో కూడా...

ABN, First Publish Date - 2023-03-15T15:05:24+05:30

మద్యం కుంభకోణంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: మద్యం కుంభకోణం (Liquor Scam)పై బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (BJP leader and former MP Boora Narsaiah Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీకి మించి తెలంగాణ (Telangana) లో భారీ లిక్కర్ స్కాం జరిగిందని అన్నారు. త్వరలో ఆధారాలతో సహా బయట పెడతామని స్పష్టం చేశారు. ఫారిన్ లిక్కర్ సేల్స్‌లో ఒక వ్యక్తికి వందల కోట్లు లబ్థి చేకూరుతుందని తెలిపారు. ఫారిన్ లిక్కర్ పాలసీకి ఐదేళ్ళ కాలపరిమితి ఇవ్వటానికి కారణమేంటో తేలాలన్నారు. ఫారిన్ లిక్కర్ టెండర్‌కు 24 గంటలే సమయం ఇవ్వటానికి కారణమేంటని ప్రశ్నించారు. టెండర్‌లో కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే ఎందుకొచ్చిందని నిలదీశారు. హైదరాబాద్‌లో ఒక వైన్స్‌లో రోజుకు కోటి రూపాయలు సేల్స్ ఉంటోందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన డిస్కౌంట్ ఒక ప్రైవేట్ వ్యక్తికి వెళ్తోందని తెలిపారు. షాపు పేరు.. వ్యక్తి పేరు త్వరలో బయట పెడతామని మాజీ ఎంపీ వెల్లడించారు.

బండి సంజయ్ వ్యక్తి కాదు...

రాజకీయ పార్టీల్లో వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు సహజమన్నారు. కాంగ్రెస్ కల్చర్‌ను బీజేపీ దిగుమతి చేసుకుందనేది ప్రచారం మాత్రమే అని తేల్చేశారు. బండి సంజయ్ (Bandi Sanjay) వ్యక్తి కాదు.. వ్యవస్థ‌ అని.. వ్యక్తి కంటే వ్యవస్థలకే ప్రాధాన్యత ఉంటోందని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-03-15T15:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising