ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: చేపల పులుసే కొంప ముంచిందన్న బండి సంజయ్

ABN, First Publish Date - 2023-10-14T15:57:11+05:30

దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దే అని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సులో బండి సంజయ్ మాట్లాడుతూ.. చేపల పులుసే కొంప ముంచిందని.. చేపల పులుసు తిని‌ కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు రావాల్సిన చోట 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టారన్నారు.

హైదరాబాద్: దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర కేసీఆర్ (CM KCR) దే అని బీజేపీ నేత బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సులో బండి సంజయ్ మాట్లాడుతూ.. చేపల పులుసే కొంప ముంచిందని.. చేపల పులుసు తిని‌ కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు రావాల్సిన చోట 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టారన్నారు. కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటంతో తన బండారం బయట పడుతోందని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. ఎన్నికలు అయ్యాక కేసీఆర్ రైతుబంధు బంద్ చేస్తారని.. కేసీఆర్ మాటలు నమ్మి రైతులు మరోసారి మోసపోవద్దని సూచించారు. కేంద్రం మోటార్లకు మీటర్లు ఎక్కడ పెట్టిందో బీఆర్ఎస్ (BRS) చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం కేసీఆర్ చేశారన్నారు. మోదీ (PM Modi) రామగుండంలో వాస్తవాలు చెప్పాకనే సింగరేణి ప్రైవేటీకరణపై కేసీఆర్ వెనక్కి తగ్గారన్నారు. ఏపీ సీఎంతో కుమ్మక్కు అయి.. కేసీఆర్ దక్షిణ తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేసింది కేంద్రమే అని చెప్పుకొచ్చారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం ఒక్క చుక్క‌ నీరు లేకపోవటానికి కేసీఆర్ కారణమన్నారు. ఉచిత యూరియా హామీ ఎటు పోయిందో కేసీఆర్ చెప్పాలన్నారు. రానున్న ఎన్నికలలో తెలంగాణ రైతులు బీజేపీకి తమ ఓటును ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.

Updated Date - 2023-10-14T15:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising