DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే
ABN, First Publish Date - 2023-12-13T13:27:35+05:30
Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలిని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (BJP Leader DK Aruna) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలిని డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతుందన్నారు. మూడు పార్టీలు ఒక్కటేనని స్పీకర్ ఎన్నిక స్పష్టం చేస్తోందన్నారు. రైతుబంధును వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రూ.500 గ్యాస్ కోసం ఎజెన్సీల ముందుకు మహిళలు క్యూ కడుతున్నారన్నారు. బీజేపీ పోరాటం వలనే కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఉచిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎవరు ఎవరితో కుమక్కు అయ్యారో తాజా పరిణామాలే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్లను గణనీయంగా పెంచుకుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో మట్టి కరింపించారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయన్నారు. ఆర్థిక భారాన్ని సాకుగా చూపి ఎన్నికల హామీలను కాంగ్రెస్ ఎగనాం పెట్టకూడదని హితవుపలికారు. ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే అని పట్టుబట్టారు. వరసగా మూడోసారి నరేంద్రమోదీ దేశానికి ప్రధాని కాబోతున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 403 స్థానాలను గెలవబోతోందన్నారు. ప్రధాని మోదీ పాలనపై చిల్లర మాటలు మాట్లాడిన వారికి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చెంపపెట్టన్నారు. రాహుల్ గాంధీ సన్మిహిత ఎంపీ సాహూ ఇంట్లో వందల కోట్లు దొరకటం సిగ్గుచేటన్నారు. అవినీతి సామ్రాట్‌లు నరేంద్రమోదీని గద్దె దించాలని చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావన్నారు. మోదీ హయాంలో అభివృద్ధిలో భారతదేశం దేశం దూసుకుపోతోందని డీకే అరుణ పేర్కొన్నారు.
Updated Date - 2023-12-13T13:27:37+05:30 IST