BJP: తెలంగాణ బిడ్డలారా.. కేసీఆర్ మిమ్మల్ని చూస్తారట.. విజయశాంతి సెటైరికల్ పోస్ట్
ABN, First Publish Date - 2023-03-23T15:11:38+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనపై బీజేపీ నేత విజయశాంతి తనదైన రీతిలో స్పందించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జిల్లాల పర్యటనపై బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) తనదైన రీతిలో స్పందించారు. కేసీఆర్ (Telangana CM) ఈరోజు ఖమ్మం (Khammam), వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. దీనిపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... ‘‘తెలంగాణ బిడ్డలారా... ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిమ్మలను చూస్తారట. ఏడాదికోసారి అచ్చే ఉగాది లెక్క.. మల్ల ఎప్పుడు కన్పడ్తరో.. లేదో ఈ గాలి మోటార్లలో తిరిగే దొరగారు ? స్వాగతిస్తరో... లేదా ఓటు ద్వారా వచ్చే ఎన్నికలల్ల సెలవిస్తమని చెప్తరో మీ విజ్ఞత’’ అంటూ సోషల్ మీడియా (social Media)వేదికగా సెటైరికల్ పోస్ట్ చేశారు.
కాగా.. ఈరోజు ఖమ్మం, వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. ఇందులో భాగంగా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటను పరిశీలించారు. ముందుగా ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలం రావినూతలలో కేసీఆర్ పర్యటించారు. అకాల వర్షంతో.. వడగళ్లతో దెబ్బతిన పంటలను సీఎం హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. గార్లపాడులో కేసీఆర్(KCR) నేలకొరిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎంత పంట వేశారు..ఎంత పెట్టుబడి పెట్టారని ఆరా తీశారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ జిల్లాకు కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలి అడవీ రంగాపురం గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
Updated Date - 2023-03-23T15:23:06+05:30 IST