BJP MP: పార్టీ మార్పుపై ఎంపీ సోయం బాపూరావు రియాక్షన్
ABN, First Publish Date - 2023-05-16T15:10:39+05:30
పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఖండించారు.
హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు (Adilabad MP Soyam Bapurao) ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో (Congress party) చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నాపై అర్థం లేని ఆరోపణలు బాధాకరం. ఈ నెల 27న నా కొడుకు పెళ్లి ఉంది.. పెళ్లి కార్డులు అన్ని పార్టీల వారికీ ఇస్తాం. పార్టీలకు అతీతంగా పెళ్లికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నాను. అందులో భాగంగా కేసీఆర్ (Telangana CM KCR), రేవంత్ రెడ్డికి (TPCC Chief Revanth Reddy) సైతం పెళ్ళి పత్రిక ఇస్తాను. మహేశ్వర్ రెడ్డిని (Maheshwar Reddy) బీజేపీలోకి (BJP) నేనే ఆహ్వానించా. మహేశ్వర్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు. నాపై తప్పుడు ప్రచారం వెనక బీఆర్ఎస్ (BRS) ఉంది. కర్ణాటక గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ దేశమంతా గెలిచిన్నట్టు కాదు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన ఓట్ల శాతం తగ్గలేదు’’ అంటూ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు.
Updated Date - 2023-05-16T15:10:39+05:30 IST