BRS MP Ranjith Reddy : మేము ఇండియా పక్షంతో లేము.. కేజ్రీ కోరారనే..
ABN, First Publish Date - 2023-07-26T13:06:25+05:30
మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు ప్రధాని ఎందుకు సంశయిస్తున్నారో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. మణిపూర్ అంశంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు. బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇచ్చిందన్నారు. విపక్షాలు వాయిదా తీర్మానం ఇస్తే తాను మాట్లాడాలా? అనే ధోరణిలో ప్రధాని ఉన్నారని రంజిత్ రెడ్డి విమర్శించారు.
ఢిల్లీ : మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు ప్రధాని ఎందుకు సంశయిస్తున్నారో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. మణిపూర్ అంశంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు. బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇచ్చిందన్నారు. విపక్షాలు వాయిదా తీర్మానం ఇస్తే తాను మాట్లాడాలా? అనే ధోరణిలో ప్రధాని ఉన్నారని రంజిత్ రెడ్డి విమర్శించారు. మణిపూర్ హింసపై ప్రధాని మౌనం వీడాలన్నారు. అవిశ్వాస తీర్మానంపై ప్రశ్నత్తరాల తర్వాత తీసుకుంటామనడం హాస్యాస్పదమన్నారు.
అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుందన్నారు. దేశంలోని అంశాలతోపాటు తెలంగాణ అంశాలను లేవనేత్తుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమని.. తాము ఇండియా పక్షంతో లేమన్నారు. కాంగ్రెస్‌తో కలిసి వేళ్లే ప్రసక్తే లేదన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరినందుకే ఆర్డినెన్స్‌కి వ్యతిరేకంగా ఆప్‌కు మద్దతు ఇస్తున్నామని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయమే కావాలనేలా ప్రధాని వ్యవహారశైలి ఉందన్నారు. ప్రధాని మోదీ పట్టుదలకు పోతున్నారని.. ఢిల్లీ ఆర్డినెన్స్ ముఖ్యం కాదని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-07-26T13:06:25+05:30 IST