ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Gratitude Concert: సీబీఎన్ గ్ర్యాటీటుడ్ కన్సర్ట్ ప్రారంభం.. వేలాదిగా తరలి వచ్చిన బాబు అభిమానులు

ABN, First Publish Date - 2023-10-29T19:04:26+05:30

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ( Hi-Tech City Cyber ​​Towers Silver Jubilee Celebration )ల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ( CBN Gratitude Concert ) ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ( Hi-Tech City Cyber ​​Towers Silver Jubilee Celebration )ల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ( CBN Gratitude Concert ) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీ అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు.

నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామ కృష్టమ రాజు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్, ఏబీ వెంకటేశ్వరరావు బండ్ల గణేష్‌, బీఆర్ఎస్ పార్టీ శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బోయపాటి శ్రీనివాస్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనూప్‌ రూబెన్స్‌ టీమ్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి జరుగుతోంది. సైబర్‌ టవర్స్‌ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. చంద్రబాబు అభిమానులతో గచ్చిబౌలి మైదానం నిండిపోయింది. సెల్‌ఫోన్ల లైటింగ్‌తో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపారు.

Updated Date - 2023-10-29T19:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising