Kishan Reddy: బండి సంజయ్‌కు రాష్ట్రం మొత్తం అండగా ఉంటుంది...
ABN, First Publish Date - 2023-04-06T13:57:04+05:30
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీ బీజేపీ (BJP) అని, ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానాలు (Self-Sacrifices) చేసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family) మాత్రం వచ్చిన తెలంగాణలో మేమే అధికారంలో ఉండాలనుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ (Bandi Sanjay)కు రాష్ట్రం మొత్తం అండగా ఉంటుందని, సంజయ్‌ను అరెస్టు చేసినంత మాత్రాన పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు.
బండి సంజయ్ అరెస్టు సందర్భంగా కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా అరెస్టును అడ్డుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రగతిభవన్ (Pragatibhavan) తెలంగాణ ద్రోహులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమ కారులపై కేసులు పెట్టిన వారు మంత్రులుగా ఉన్నారని, తెలంగాణ వద్దు అంటూ చెప్పిన మజ్లిస్ పార్టీ (Majlis Party) నేడు బీఆర్ఎస్కు ఫ్రెండ్లీ పార్టీగా మారిందన్నారు. సంజయ్ కోసం రాజకీయ, న్యాయ పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని (BRS Govt.) కూకటి వేళ్లతో పెకలించే వరకు ప్రతి ఒక్కరు పోరాటం చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2023-04-06T13:57:04+05:30 IST