CM KCR: వడగండ్ల వాన ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
ABN, First Publish Date - 2023-03-22T22:11:32+05:30
CM KCR, CM Tour, Hailstorm, Crop loss, Khammam, Mahabubabad, Warangal, Karimnagar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది...వడగండ్లు, ఈదురుగాలులతో మామిడి, మొక్కజొన్న, వరి, మిర్చి, వేరుశనక, పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నీళ్లపాలు కావడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. రైతులను కలిసి భరోసా ఇచ్చేందుకు గురువారం సీఎం కేసీఆర్ అకాల వర్షాల ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. వడగళ్ల వానతో నష్టం వాటిల్లిన ఖమ్మం(Khammam), మహబూబాబాద్(Mahabubabad), వరంగల్(Warangal), కరీంనగర్(Karimnagar) జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ పర్యటనలో అకాల వర్షాలతో పంట నష్ట(Crop loss) పోయిన రైతులను కలిసి భరోసా కల్పించనున్నారు. కాగా వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లా మంత్రులు(District Ministers), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS), వ్యవసాయ శాఖ అధికారులను(Agriculture Department officials) ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్ట(Crop loss) పోయిన రైతులను కలిసి భరోసా కల్పించనున్నారు. కాగా వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లా మంత్రులు(District Ministers), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS), వ్యవసాయ శాఖ అధికారులను(Agriculture Department officials) ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
కాగా రాష్ట్రంలో భారీగా కురిసిన వడగండ్ల వానలు, ఈదురుగాలులతో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో(Acres) పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఎక్కువగా మొక్కజొన్న, వరి, మిర్చి, వేరుశనక, పత్తిపంటలు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ద్రోణి కారణంగా అనూహ్య వర్షాలు, వడగళ్ల వానలు కురియడంతో కొద్ది రోజుల్లోనే రబీ పంట చేతికందుతుందని ఆశించిన రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
జిల్లా కలెక్టర్ల ప్రాథమిక అంచనాల ప్రకారం.. 80 వేల మంది రైతులకు చెందిన 2.50లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలమేరకు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా నివేదికలు రూపొందించారు.
Updated Date - 2023-03-22T22:34:01+05:30 IST