CM KCR: నాంపల్లి అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ABN, First Publish Date - 2023-11-13T12:33:45+05:30
నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
కాగా.. నాంపల్లి బజార్‌ఘాట్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీజిల్ డ్రమ్ముల్లో చెలరేగిన మంటలతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కొందరు సజీవదహనం అవగా... మరికొందరు ఊపిరాడక మృతి చెందారు. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.
Updated Date - 2023-11-13T12:33:46+05:30 IST