ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR : వరంగల్ సభకు కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం.. హాజరవుతారా.. లేదా? ఆసక్తికర చర్చ

ABN, First Publish Date - 2023-07-06T10:06:28+05:30

ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక వరంగల్‌లో నిర్వహించనున్న మోదీ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం పంపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక వరంగల్‌లో నిర్వహించనున్న మోదీ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం పంపింది. మరి ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా అనే దానిపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ నడుస్తోంది.

చాలా కాలంగా ప్రధాని మోదీ తెలంగాణలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారంటే.. కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికిన దాఖలాలు కూడా లేవు. జాతీయ పార్టీ ప్రారంభానికి ముందు నుంచే ప్రధాని తెలంగాణలో నిర్వహించే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా బీజేపీపై కేసీఆర్ తన వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా ఇటీవలి కాలంలో తన ప్రధాన ప్రత్యర్థి స్థానం నుంచి బీజేపీని ఆయన తప్పించారో లేదంటే.. మోదీ విషయంలో తన వైఖరే మారిపోయిందో కానీ ఇటీవల అయితే బీజేపీ లేదంటే మోదీ విషయంలో పెద్దగా కేసీఆర్ బాణాలు ఎక్కుపెట్టడం లేదు. పరిస్థితులకు అనుకూలంగా ఆయన కూడా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-07-06T12:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising