CM Revanth: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ..
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:02 PM
Telangana: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం పీవీ జ్ఞాన భూమి వద్ద సీఎం, మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని కొనియాడారు.
హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (Former PM PV Narasimhareddy) 19వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులు అర్పించారు. శనివారం పీవీ జ్ఞాన భూమి వద్ద సీఎం, మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని కొనియాడారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారని.. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారని గుర్తుచేశారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని అన్నారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని తెలిపారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమని చెప్పుకొచ్చారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారన్నారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Dec 23 , 2023 | 12:02 PM