TS Election: పొత్తుపై కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు డెడ్ లైన్!
ABN, First Publish Date - 2023-10-18T14:54:29+05:30
పొత్తుపై కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు డెడ్ లైన్ విధించారు. మునుగోడు సీటు కచ్చితంగా తమకే కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది. కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్ల ఇవ్వాలని
హైదరాబాద్: పొత్తుపై కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు డెడ్ లైన్ విధించారు. మునుగోడు సీటు కచ్చితంగా తమకే కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది. కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్ల ఇవ్వాలని సీపీఐ కోరింది. ఇదిలా ఉంటే సీపీఐకు చెన్నూరు, కొత్తగూడెం సీట్లను కాంగ్రెస్ ఆఫర్ చేస్తోంది. చెన్నూరులో తమకు క్యాడర్, లీడర్ లేడని సీపీఐ అంటోంది. దీంతో ఈ వ్యవహారం సందిగ్ధంలో పడింది.
ఇక సీపీఎం.. భద్రాచలం, పాలేరు, ఇబ్రహీంపట్నం, మిర్యాలగూడ, ఖమ్మం సీట్లను అడుగుతోంది. ఇప్పటికే భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కనీసం మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం సీట్లైనా ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండంతో ఏదొకటి తేల్చుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్‌తో పొత్తు అంశం తేల్చే బాధ్యతను నారాయణకు సీపీఐ బాధ్యతలు అప్పగించింది.
Updated Date - 2023-10-18T14:55:19+05:30 IST