ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Sharmila: షర్మిల బెయిల్‌పై పూర్తైన వాదనలు.. తీర్పు వాయిదా

ABN, First Publish Date - 2023-04-25T12:01:29+05:30

పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో మంగళవారం వాదనలు పూర్తి అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల్ (YS Sharmila) బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో (Nampalli Court) మంగళవారం వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును ఈరోజు మధ్యాహ్నానికి కోర్టు వాయిదా వేసింది. పిటిషన్‌పై షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వాదించారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఆరు నెలలు, మూడు సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేవే అని తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. హైకోర్టు నిబంధనలను కూడా పోలీసులు పాటించడం లేదని చెప్పారు. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న ఒక్క వీడియోనే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. అంతకంటే ముందు చోటు చేసుకున్న వీడియోల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు.

పోలీస్ తరపు న్యాయవాది వాదనలు...

షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని.. షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

Updated Date - 2023-04-25T12:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising