ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Feroze Khan: తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ పిటీషన్.. కారణమేంటంటే..?

ABN, First Publish Date - 2023-10-12T21:57:48+05:30

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్‌ఖాన్(Feroze Khan) పిటీషన్ వేశారు. నాంపల్లి ఓటర్ల జాబితా(Nampally Voters List)పై హైకోర్టు పట్టించుకోవాలని ఈ పిటిషన్‌లో కోరారు.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్‌ఖాన్(Feroze Khan) పిటీషన్ వేశారు. నాంపల్లి ఓటర్ల జాబితా(Nampally Voters List)పై హైకోర్టు పట్టించుకోవాలని ఈ పిటిషన్‌లో కోరారు. పిటీషన్‌లో ఏం పేర్కొన్నారంటే... ‘‘నాంపల్లిలో 45వేలకు పైగా బోగస్ ఓట్లున్నాయి. మరణించిన, ఇళ్లు మారిన, రెండుచోట్ల ఓటు హక్కు ఉన్న ఓటర్లను ఎలక్షన్ కమిషన్ తొలగించలేదు. ప్రత్యేక సవరణ చేపట్టి బోగస్ ఓట్లు తొలగించేలా ఈసీని ఆదేశించాలి’’ అని ఫిరోజ్‌ఖాన్‌ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చేపట్టింది. ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించాకే తుది జాబితా ఖరారు చేశామని ఈసీ హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం చెప్పింది. అభ్యంతరాలపై సీఈఓకు ఫిర్యాదు చేయాలని ఫిరోజ్ ఖాన్‌కు హైకోర్టు సూచించింది. ఫిరోజ్‌ఖాన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది.

Updated Date - 2023-10-12T22:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising