ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponguleti Srinivasa Reddy : ‘కాంగ్రెస్‌లోకి షర్మిల’ ప్రచారంపై పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు...

ABN, First Publish Date - 2023-07-10T15:03:13+05:30

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో హస్తం పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారని, ఈ వ్యవహారాన్ని వాళ్లే చూసుకుంటారని తేల్చిచెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో హస్తం పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారని, ఈ వ్యవహారాన్ని వాళ్లే చూసుకుంటారని తేల్చిచెప్పారు. ఏపీ వెళ్లి సీఎంవో అధికారులను మాత్రమే కలిశానని, సీఎం జగన్‌ను తాను కలవలేదని వివరణ ఇచ్చారు. తన సంస్థకు చెందిన కాంట్రాక్ట్ సంబంధించిన అంశాలు అధికారులతో చర్చించానన్నారు. షర్మిల (YS Sharmila) టాపిక్ ఏమాత్రం చర్చించలేదని, వైఎస్ఆర్సీపీ పార్టీని తెలంగాణలో జగన్ వద్దనుకున్నారన్నారని వెల్లడించారు. సోమవారం సీఎల్పీ నేత భట్టి నివాసానికి వెళ్లిన పొంగులేటి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తమ జిల్లా నేత భట్టి విక్రమార్కను (Bhatti Vikramarka) మర్యాదపూర్వకంగా కలవాలని వచ్చామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై భట్టితో చర్చించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ (CM KCR) పరిపాలనను బంగాళాఖాతంలో కలపడంపై చర్చించామన్నారు. కేసీఆర్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తీరు ‘‘నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’’ అన్నట్లుగా ఉందంటూ సెటైర్ విసిరారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలు ఉన్నాయని.. అవి ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, రెండు వ్యతిరేక వర్గం అని చెప్పుకొచ్చారు. ప్రజలు ఈసారి కేసీఆర్‌ను ఇంటికి పంపాలని బలంగా డిసైడ్ అయి ఉన్నారన్నారు.

Updated Date - 2023-07-10T15:45:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising