TS News: గాంధీభవన్‌లో భేటీ కానున్న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ
ABN, First Publish Date - 2023-10-10T14:34:49+05:30
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సాయంత్రం గాంధీ భవన్‌లో భేటీ కానుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (T.Congress) రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సాయంత్రం గాంధీ భవన్‌లో భేటీ కానుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Batti Vikramarka), ఇతర సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బస్సు యాత్ర, పార్టీ అగ్రనాయకుల పర్యటనపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘తిరగబడదాం-తరిమికొడదాం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంకా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మేనిఫెస్టో, బహిరంగ సభలు, రోడ్ షోలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
నాయకుల ఐఖ్యతను చాటేందుకు కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టనుంది. ఈనెల 15వ తేదీన ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించి, ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. రెండు రోజులు ఆమె బస్సు యాత్రలో పాల్గొననున్నారు. 10 రోజుల్లో రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చుట్టేయనుంది. 15న అలంపూర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 10 రోజుల షెడ్యూల్‌లో 10 రోజుల పాటు బస్సు యాత్రలో ఏఐసీసీ అగ్ర నేతలు పాల్గొంటారు. 15, 16 తేదీలలో బస్సుయాత్రలో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పాల్గొంటారు. అలాగే 18,19 తేదీలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బస్సు యాత్రలో పాల్గొననున్నారు. 20, 21 తేదీలలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పాల్గొంటారు. మిగతా నాలుగు రోజులలో కర్నాటక (Karnataka) సీఎం సిద్ద రామయ్య (CM Sidda Ramaiah), డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (DK Sivakumar) తదితరులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2023-10-10T14:34:49+05:30 IST