ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: బండి సంజయ్‌పై కుట్ర కేసు.. భువనగిరి కోర్టుకు తరలింపు..

ABN, First Publish Date - 2023-04-05T11:38:42+05:30

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేసి.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి భువనగిరి కోర్టుకు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)పై పోలీసులు కుట్ర కేసు (Conspiracy Case) నమోదు చేసి.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి భువనగిరి కోర్టు (Bhuvanagiri Court)కు తరలించారు. సంజయ్ కనిపించకుండా కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టారు. బండిని తరలిస్తుండగా కారును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వారిని బలప్రయోగంతో పోలీసులు చెదరగొట్టారు.

ఇదిలా ఉండగా బీజేపీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition) వేసింది. చీఫ్ జస్టిజ్ ఉజ్వల్ భుయాన్ (Ujwal Bhuyan) దగ్గరకు వెళ్ళిన లీగల్ సెల్ ప్రతినిధులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. టెన్త్ పేపర్ లీకేజీ తెలంగాణలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో బండి సంజయ్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. బండిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావును పోలీసులు అరెస్టు చేయడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. బండి అరెస్టును బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్టును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ బీజేపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో బీజేపీ నేయకులు నిరసనకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను హౌస్ అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ను పోలీసులు పీఎస్‌కు తరలించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ను హకీంపేట్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.. ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-04-05T11:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising