TS News: ఆత్మహత్యకు కాదేది అనర్హం అన్నట్లుగా.. ఓ కానిస్టేబుల్ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-06-10T12:23:43+05:30
చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్న రోజులివి. క్షణికావేశాలతో నిర్ణయాలు తీసుకుని కన్నవారికి తీవ్రశోకాన్ని మిగులుస్తున్నారు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, సెల్‌ఫోన్ కొనివ్వట్లేదని, సెల్‌ఫోన్ పోయిందని
హైదరాబాద్: చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్న రోజులివి. క్షణికావేశాలతో నిర్ణయాలు తీసుకుని కన్నవారికి తీవ్రశోకాన్ని మిగులుస్తున్నారు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, సెల్‌ఫోన్ కొనివ్వట్లేదని, సెల్‌ఫోన్ పోయిందని, పెళ్లి కావట్లేదు, అందగా లేనని, జాబ్ రావట్లేదని, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో, నచ్చిన కూరవండలేదని, తల్లిదండ్రులు మందలించారని ఇలా ఆత్మహత్యకు కాదేది అనర్హం అన్నట్లుగా కొందరు నిండు జీవితాన్ని బలితీసుకుంటున్న పరిస్థితి. ఇలాంటివి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక కారణాలతో చిన్నవారి నుంచి పెద్దల వరకు బలవన్మరణాలకు పాల్పడుతున్న వార్తలను వింటూనే ఉన్నాం.
ఇప్పుడు తాజాగా భాగ్యనగరంలోనూ ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే సదరు కానిస్టేబుల్ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడో తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. యాచారంలో వినోద్ అనే కానిస్టేబుల్ తలవెంట్రుకలు ఊడిపోతున్నాయనే కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వినోద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా గత మార్చ్ నుంచి వినోద్ సిక్ లీవ్‌లో ఉన్నాడు. చివరకు ఈరోజు వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడు. తలవెంట్రుకలు ఊడిపోతున్నాయనే కారణంగానే వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-06-10T12:23:43+05:30 IST