Baby Movie: పోలీసులు ఇప్పుడే మేల్కొన్నారా? మరి సెన్సార్ బోర్డు ఏం చేసింది?
ABN, First Publish Date - 2023-09-15T14:00:05+05:30
బేబీ మూవీ విడుదలై దాదాపు 10 వారాలు దాటుతోంది. ఆహా వేదికగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 24న ఈటీవీ ఛానల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా కూడా బేబీ మూవీ టెలీకాస్ట్ కానుంది. అయితే తెలంగాణ పోలీసులు ఇప్పుడే మేల్కొన్నట్లు కనిపిస్తోంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ మూవీ టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ విడుదలై దాదాపు 10 వారాలు దాటుతోంది. ఆహా వేదికగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 24న ఈటీవీ ఛానల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా కూడా బేబీ మూవీ టెలీకాస్ట్ కానుంది. అయితే తెలంగాణ పోలీసులు ఇప్పుడే మేల్కొన్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీలో డ్రగ్స్ వాడుతున్న సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి అన్న సామెత చందాన.. పోలీసులకు ఇప్పుడే తెల్లారిందే.. ఇప్పటి వరకు కళ్లు మూసుకున్నారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. సెన్సార్ బోర్డు మాత్రం డ్రగ్స్ సన్నివేశాలకు హెచ్చరిక డిస్‌ప్లే చేయాలని సూచించగా.. సినిమాలో ఈ మేరకు మేకర్స్ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లే చేశారు. అయితే యూట్యూబ్‌లో మాత్రం ఆయా సన్నివేశాల్లో ఈ మెసేజ్ వేయకపోవడంపై వివాదం చెలరేగింది.
ఇది కూడా చదవండి: Hero Navdeep: హీరో నవదీప్‌కు నార్కోటిక్ పోలీసుల నోటీసులు?
అటు బేబీ సినిమాలో సన్నివేశాలకు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సీన్ మెమోలో పేర్కొన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దృశ్యాలకు పెద్దగా తేడా ఏమీ లేదని సీపీ సీవీ ఆనంద్ ఆరోపించారు. ఈ అంశంపై బేబీ సినిమా మేకర్స్‌కు నోటీసులు కూడా ఇచ్చామని తెలిపారు. అయితే సినిమా విడుదలై ఇన్ని రోజులు దాటుతుంటే ఇప్పుడు ఆ సినిమాపై ఆరోపణలు చేయడంలో ఆంతర్యమేంటో పోలీసులకే తెలియాలంటూ నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. మరి డ్రగ్స్ సన్నివేశాల విషయంలో సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు తమకు ఇచ్చింది అడ్వైజరీ నోటీసులు మాత్రమేనని బేబీ సినిమా దర్శకుడు సాయిరాజేష్ వివరణ ఇచ్చాడు. గురువారం నాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని.. ‘బేబీ’ సినిమాలో ఒక సన్నివేశం గురించి ఆరా తీశారని వివరణ ఇచ్చాడు. అలాంటి సీన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరణ అడిగారన్నాడు. సిట్యుయేషన్ ఆధారంగా ఈ సన్నివేశం పెట్టాల్సి వచ్చిందని చెప్పామని.. అందుకు ఆయన కన్విన్స్ అయ్యారని సాయి రాజేష్ అన్నాడు. డ్రగ్స్ సన్నివేశాలు పెట్టాల్సిన అవసరం వస్తే యూట్యూబ్‌లో హెచ్చరిక ఎందుకు వేయలేదని అడిగారని.. యూట్యూబ్‌లో సెన్సార్ రూల్స్ ఏమీ లేవని.. అందుకే వేయలేదని వివరణ ఇచ్చామన్నారు. కానీ సినిమాలో, ఓటీటీలో హెచ్చరిక మెసేజ్ డిస్‌ప్లే చేశామని సాయి రాజేష్ పేర్కొన్నాడు.
Updated Date - 2023-09-15T14:00:05+05:30 IST