ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CP CV Anand : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ ఆనంద్..

ABN, First Publish Date - 2023-08-17T13:17:33+05:30

హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేతపై హైదరాబాద్ సీపీ ఆనంద్ సంచలన విషయాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్‌పై డేవిడ్ హుకా అనే నైజేరియన్‌ని అరెస్ట్ చేశామన్నారు. 8 ఏళ్ళు క్రితం బెంగళూరుకు వచ్చారని.. ఇండియాకి వచ్చాక పాస్టర్‌గా అవతరమెత్తి డేవిడ్ హుకా తన పేరును మార్చుకున్నాడని తెలిపారు. ఫేక్ వీసా, ఫేక్ ఐడీతో సిమ్ కార్డులు తీసుకుంటున్నాడన్నారు.

హైదరాబాద్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేతపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన విషయాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్‌ కేసులో డేవిడ్ హుకా అనే నైజేరియన్‌ని అరెస్ట్ చేశామన్నారు. 8 ఏళ్ళ క్రితం బెంగళూరుకు వచ్చారని.. ఇండియాకి వచ్చాక పాస్టర్‌గా అవతరమెత్తి డేవిడ్ హుకా తన పేరును మార్చుకున్నాడని తెలిపారు. ఫేక్ వీసా, ఫేక్ ఐడీతో సిమ్ కార్డులు తీసుకుంటున్నాడన్నారు.

ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు వాడి పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారని పేర్కొన్నారు. ఆల్ ఇండియా నైజేరియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అసోషియేషన్‌ను ఏర్పాటు చేశాడని అన్నారు. డ్రగ్స్ , గంజాయి కేసులో నైజేరియన్స్ అరెస్ట్ అయితే వారికి బెయిల్ ఇప్పించడం.. వారిని వారి దేశాలకి పంపించడం వంటి విషయాల్లో డేవిడ్ హుకా బాధ్యత తీసుకుంటున్నాడని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ఇతని కోసం బెంగళూరులో మకాం వేసి పట్టుకున్నామన్నారు. డేవిడ్ హుకా నుంచి 264 MD పిల్స్ ని సీజ్ చేశామన్నారు. రూ.4 కోట్లు ఆస్తులు జప్తు చేయబోతున్నామని సీపీ ఆనంద్ వెల్లడించారు.

కాగా.. నేటి ఉదయం హైదరాబాద్‌లో భారీగా గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయలు విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఆరుగురు గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ చేశారు. పక్కా సమాచారంతో గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో నైజీరియన్స్ డ్రగ్ సప్లై చేస్తున్నారు. 11 లక్షల విలువైన డ్రగ్స్‌ను నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ సీజ్ చేసింది. ఈ కేసులో ఒక నైజీరియన్ అరెస్ట్ అయ్యారు.

Updated Date - 2023-08-17T13:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising